మొత్తం వీడియో టీవీ 9 డిలీట్ చేసింది | రెచ్చినపోయి లైవ్ లో తిట్టుకున్నా హైపర్ ఆది, మహేష్ కత్తి
జబర్దస్త్ షోలో హైపర్ ఆది పంచ్‌లు తనను ఉద్దేశించిన వేసినవేనంటూ మహేశ్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం హైదరాబాద్‌లో లండన్ బాబులు సినిమా ప్రివ్యూ సందర్భంగా హైపర్ ఆదితో కలిసి దిగిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మహేశ్, పవన్ ఫ్యాన్స్‌కు చురకలంటించారు. తాజాగా హైపర్ దీనిపై స్పందించారు.
కత్తి మహేశ్ ఎవరో తనకు తెలియదని, నిన్ననే లండన్ బాబులు సినిమా ప్రివ్యూ సందర్భంగా చూశానని ఆది తెలిపాడు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆది మాట్లాడుతూ, కత్తి మహేశ్‌కు పొట్ట, బట్ట రెండూ లేవని అన్నాడు.తాను ఆయనను దృష్టిలో ఉంచుకుని పంచ్ డైలాగులు వేయలేదని, తమ ఊర్లో ఉన్న సుత్తి రాజేష్ గురించి వ్యాఖ్యానించానని తెలియజేశాడు. సుత్తి రాజేష్ ఇంటింంటికీ తిరుగుతూ పని చేసుకుని బతుకుతాడని, ఫేస్‌బుక్ లో ఏది పడితే అది అంటాడని పేర్కొన్నాడు. తన వీడియోలు కోటి మంది చూస్తారని, కత్తి మహేశ్ రివ్యూలు లక్ష మంది చూస్తారని అన్నాడు. కత్తి మహేశ్ తనను తాను సెలబ్రటీ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశాడు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని వ్యాఖ్యానించాడు. తన ఫోటో పెట్టి ఫ్యాన్స్‌కు 'మేము మేము ఇలా కలిసిపోతాం..మధ్యలో వెధవలయ్యేది మీరేనని వ్యాఖ్యానించాడని, తాము అభిమానులను అలా అనమని అన్నాడు. స్క్రిప్టు రాయాలంటే చాలా కష్టమని, అంత కష్టపడి సినిమా తీస్తే అది బాగాలేదనడానికి కత్తి మహేశ్ ఎవరని ఆది ప్రశ్నించాడు.
జబర్దస్త్ షోలో హైపర్ ఆది పంచ్‌లు తనను ఉద్దేశించిన వేసినవేనంటూ మహేశ్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం హైదరాబాద్‌లో లండన్ బాబులు సినిమా ప్రివ్యూ సందర్భంగా హైపర్ ఆదితో కలిసి దిగిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మహేశ్, పవన్ ఫ్యాన్స్‌కు చురకలంటించారు. తాజాగా హైపర్ దీనిపై స్పందించారు.

Comments
Post a Comment