టీవీ 9 యాంకర్ నోరు తెరిచింది హీరో సిద్దార్ద్ మాటలు చూసి | ఇలా ఇంత వరకు ఏ హీరో మాట్లాడలేదు

టీవీ 9 యాంకర్ నోరు తెరిచింది హీరో సిద్దార్ద్ మాటలు చూసి | ఇలా ఇంత వరకు ఏ హీరో మాట్లాడలేదు 
తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’వంటి హిట్‌ చిత్రాలలో నటించి లవర్‌బోయ్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్న హీరో సిద్దార్ద్‌. కానీ ఆ తర్వాత ఆయన చిత్రాలు సరిగా ఆడకపోవడంతో తమిళంలోకి వెళ్లి హీరోగా చిత్రాలు చేస్తున్నాడు. అక్కడ చేసిన చిత్రాలనే డబ్బింగ్‌లతో ఇక్కడ రిలీజ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయనే హీరోగా, స్వీయ నిర్మాణంలో మిలింద్‌ దర్శకత్వంలో ‘గృహం’ అనే హర్రర్‌ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించాడు. త్వరలో విడుదల కానున్న ఈచిత్రంలో సిద్దార్ద్‌, ఆండ్రియాలు నటిస్తున్నారు. ఈ చిత్రం పాటలను తాజాగా నాని చేత రిలీజ్‌ చేయించారు. 

ఇక ఈచిత్రం ట్రైలర్‌ని చూస్తే ఇది ఓ హిందీ ఎరోటిక్‌ చిత్రంగా అనిపిస్తోంది. కానీ ఇది హర్రర్‌ చిత్రం. ఓ పాట నిండా లిప్‌లాక్‌ సీన్సే ఉన్నాయి. ట్రైలర్‌ కూడా బాగానే భయపెడుతోంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని 20నిమిషాలకు మించి నాని భయంతో చూడలేకపోయాడట. ఇక ఇది జెన్యూన్‌ హర్రర్‌ని హర్రర్‌గా చూపించే చిత్రమని నాని, సిద్దార్ద్‌లు చెబుతున్నారు. ఈ చిత్రం ద్వారా మరలా సిద్దార్ద్‌ కమ్‌ బ్యాక్‌ అంటున్నారు. ఆ మాట నాకు నచ్చదు. మరలా నేను వస్తే సిద్దార్ద్‌ మావాడు అంటారు. నన్ను హీరోగా ఫస్ట్‌ గుర్తించింది తెలుగు పరిశ్రమే. ఇక నాతరహా చిత్రాలు ఎవరు చేస్తున్నారు? అని ఆరా తీస్తే నాని అని చెప్పారు. దాంతో నేను నానికి పెద్ద ఫ్యాన్‌ని అయ్యాను. ఇక ఈ చిత్రం విషయంలో నాకు స్ఫూర్తి రాజమౌళిగారి ఓ ప్రెస్‌మీట్‌. ఆయన ‘ఈగ’ చిత్రం ఓపెనింగ్‌ సందర్భంగా కథ మొత్తం మీడియాకు చెప్పేశాడు. సినిమా ప్రారంభంలోనే కథ చెప్పాలంటే దమ్ముకావాలి. ఎందుకంటే రాజమౌళి గారు కథనాన్ని, మేకింగ్‌స్టైల్‌ని నమ్ముకున్నాడు. అలాగే నేను కూడా నా చిత్రం కథను మొత్తం చెప్పేశాను. 



Comments