వేణు మాధవ్ షాక్ ఇచ్చిన సీఎం చంద్ర బాబు & టీం | స్టేజి మీద నుండి నెట్టి వేశారు ఇక్కడ మీరు ఉండకూడదు అని

వేణు మాధవ్ షాక్ ఇచ్చిన సీఎం చంద్ర బాబు & టీం | స్టేజి మీద నుండి నెట్టి వేశారు ఇక్కడ మీరు ఉండకూడదు అని 
నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున సినీ నటుడు వేణు మాధవ్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బాబుతో పాటు వేణుమాధవ్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా వేణు మాధవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు తానొక రిక్వెస్ట్ చేశానని చెప్పాడు. నంద్యాలకు చంద్రబాబును రావొద్దని చెప్పానని, ఇక్కడి మెజార్టీని టీవీల్లో చూడమని చెప్పానని వేణు మాధవ్ వ్యాఖ్యానించాడు. ఇక్కడికి వచ్చి ప్రజా స్పందన చూసి ఆనందిస్తానని చంద్రబాబు చెప్పారని వేణుమాధవ్ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన వేణుమాధవ్ ఒకడంటాడు.. బుద్ది లేనోడు తనకు చానల్ లేదు, పేపర్ లేదని, మరి చానల్ లేనోడికి.. పేపర్ ఎక్కడిదిరా బట్టేబాజ్ అంటూ తీవ్ర పదజాలంతో జగన్‌పై వేణుమాధవ్ మండిపడ్డాడు. తనకు భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిల ప్రియ బిడ్డల లాంటి వారని, అలాంటి వారిపై విమర్శలు చేసే వారి గురించి తాను మాట్లాడటం నీచమని, నికృష్టమని వేణుమాధవ్ చెప్పాడు. నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, రోడ్డు పొడవూ ప్రొక్లెయిన్లు కనిపిస్తున్నాయని చెప్పాడు. కొందరికి గుర్తులు తెలియక చేత్తో పట్టుకుని చూపిస్తున్నారని, టీడీపీ గుర్తు ప్రజల గుండెల్లో ఉందని వేణుమాధవ్ తన ప్రసంగాన్ని ముగించాడు.

Comments