వామ్మో ఈ సీన్ లో రోజా ఓవర్ యాక్షన్ చేసినట్లు ఇంకా ఏ సినిమాలో చేయలేదు | ఇంటర్వెల్ సీన్ కి పిచ్చి ఎక్కింది

వామ్మో ఈ సీన్ లో రోజా ఓవర్ యాక్షన్ చేసినట్లు ఇంకా ఏ సినిమాలో చేయలేదు | ఇంటర్వెల్ సీన్ కి పిచ్చి ఎక్కింది 
ఆ మధ్యన తెలుగువారి సంప్రదాయాలు,కుటుంబ బంధాలు అంటూ ఆర్బాటంగా వచ్చిన వరుడు(అల్లు అర్జున్)చిత్రం మిగిల్చిన చేదు అనుభూతిని మెల్లి మెల్లిగా మర్చిపోతూంటే అలాంటి బ్రాండింగ్ తోనే 'మొగుడు'చిత్రం వచ్చి పాత గాయాన్ని మళ్లీ రేపినట్లైంది.బలమైన కుటుంబం మరియు మానవ సంబంధాల నేపధ్యం అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుని ఓపినింగ్స్ ని రాబట్టుకున్న ఈ చిత్రం బలహీనమైన కథ,మెలోడ్రామా మానవ సంభందాలతో చతికిలపడింది.
 భారతీయ వివహ వ్యవస్ధలో భాగమైన తాళి గొప్పతనం చెప్పబోయి ఎగతాళి అయిపోయింది. బుజ్జి(గోపీచంద్)తొలిచూపులోనే రాజి(తాప్సి)తో ప్రేమలో పడిపోతాడు.దానికి అతని తండ్రి ఆంజనేయ ప్రసాద్(రాజేంద్రప్రసాద్)వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రాజి తల్లి,రాష్ట్ర మంత్రి అయిన అఖిలాండేశ్వరి(రోజా)తో మాట్లాడి పెళ్లి ఘనంగా జరిపిస్తాడు.అయితే పెళ్లంతా అయిన తర్వాత గౌరి దేవి విగ్రహాన్ని పెళ్లి కూతురుతో పాటు తీసుకెళ్లాలనే సంప్రదాయం వద్ద ఇరు కుటుంబాలకి గొడవ వస్తుంది.చిన్నగా మొదలైన ఆ గొడవ పెద్దదై రాజీ తన మెళ్లో తాళిని విసిరి బుజ్జి పైకి విసిరికొట్టేవరకూ వెళ్తుంది.అలా పీటల మీదే పెళ్లి పెటాకులయ్యి విడాకుల వరకూ వెళ్తుంది.అప్పుడు ఆ జంట పరిస్ధితి ఏమిటి..చివరకు వారు ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ.


Comments