తాగి దొరికిపోయిన కమెడియన్ నవీన్ | కారు కింద దాక్కున్నాడు. మీడియా రాగానే పారిపోయాడు | పిచ్చ కామెడీ

తాగి దొరికిపోయిన కమెడియన్ నవీన్ | కారు కింద దాక్కున్నాడు. మీడియా రాగానే పారిపోయాడు | పిచ్చ కామెడీ 
పోలీసులు శనివారం అర్ధరాత్రి జూబ్లిహిల్స్‌లో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు ఎప్పటిలాగే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించగా.. పలువురు యువతులపాటు మరికొందరు మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికిపోయారు. ఇక ప్రముఖ కమెడియన్‌ నవీన్‌ కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అనూహ్యంగా పట్టుబడ్డాడు. మద్యం తాగి వాహనం నడిపిస్తున్న అతను.. డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. మీడియా కంటపడకుండా ఉండేందుకు నానా పాట్లు పడ్డాడు.కారు నుంచి దిగి పారిపోవాలని చూసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఓ కారు కింద నక్కిన అతన్ని పోలీసులు గుర్తించి ఆల్కహాల్‌ పరీక్షలు నిర్వహించారు. అతడు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నవీప్‌పై కేసు నమోదుచేసి.. అతని వాహనాన్ని సీజ్‌ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న కమెడియన్‌ నవీన్‌ ‘జబర్దస్త్‌’ టీవీ షోలో కూడా పాల్గొన్నాడు. గోపీచంద్‌ హీరోగా వచ్చిన ‘ఆక్సిజన్‌’ సినిమాలోనూ నవీన్‌ నటించాడు.


Comments