జీ తెలుగు లో చిన్నపిల్లలతో అర్జున్ రెడ్డి స్పూఫ్ | స్పూఫ్ చూసి కోపం తో తిట్టినా విజయ్ దేవరకొండ

జీ తెలుగు లో చిన్నపిల్లలతో అర్జున్ రెడ్డి స్పూఫ్ | స్పూఫ్ చూసి కోపం తో తిట్టినా విజయ్ దేవరకొండ 
గత ఏడాది ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ దేవరకొండ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరినిచ్చింది. రియలిస్టిక్‌ కథను అంతే సహజంగా తెరపై ఆవిష్కరిస్తే.. అది తప్పకుండా ప్రేక్షకులకు చేరుతుందని, సినిమా సూపర్‌హిట్‌ అవుతుందని.. అర్జున్‌రెడ్డి చిత్రం నిరూపించింది. ఈ సినిమాతో సూపర్‌స్టార్‌గా ఎదిగిన విజయ్‌ దేవరకొండకు ప్రశంసలు ముంచెత్తుతున్నాయి. తాజాగా ఓ చానెల్‌ నిర్వహించిన అవార్డుల ఫంక్షన్‌లో అర్జున్‌రెడ్డి సినిమాకుగాను విజయ్‌ దేవరకొండను అవార్డు వరించింది. ఈ అవార్డును అందుకుంటున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టుచేసిన విజయ్‌ ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు.పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. ఈ చిత్రంలో విజ‌య్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.
ఎంతో మంది ఆయ‌న‌కి అభిమానులుగా మారారు. ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రం రీమేక్ అవుతుండ‌గా, విజ‌య్ బాడీ లాంగ్వేజ్ ని వారు ప్రాక్టీస్ చేస్తున్నార‌ట‌. మ‌రి అంత‌గా న‌టించి జీవించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయితే డిసెంబ‌ర్ 31 సంద‌ర్భంగా టెలికాస్ట్ అయిన ఓ అవార్డ్ ఫంక్ష‌న్ లో విజ‌య్ దేర‌కొండ‌కి అవార్డు ద‌క్కింది. మెగాస్టార్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకునే అవ‌కాశం విజ‌య్‌కి దక్క‌గా, ప‌క్క‌నే ఆయ‌న నాన్న కూడా ఉన్నారు. ఆ స‌మ‌యంలో తీసిన‌ ఫోటోని విజ‌య్ త‌న ఫేస్ బుక్ లో షేర్ చేస్తూ.. ఓవైపు నాన్న నవ్వులు.. మరోవైపు మెగాస్టార్ చిరు నవ్వులు.. 2017 ఎంత గొప్ప సంవత్సరమో కదా అని పేర్కొన్నారు. ఇక ఆ ఫోటోతో పాటు.. తన తండ్రి.. తల్లితో కలిసి అదే వేదిక మీద ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. అమ్మా..నాన్నా మీరిద్దరు ఉత్తమంలో అత్యుత్తమం అంటూ భావోద్వేగంతో పోస్ట్ చేస్తూ.. న్యూఇయర్ విషెస్ చెప్పేశాడు అర్జున్ రెడ్డి. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ అంద‌రి హృద‌యాల‌ని ట‌చ్ చేస్తుంది.



Comments