వీడియో : బండ్ల గణేష్ కి 6 నెలల జైలు శిక్ష : షాక్ తిన్న టాలీవుడ్ | ఎర్రమంజిల్ కోర్ట్ కన్నెర్ర

వీడియో : బండ్ల గణేష్ కి 6 నెలల జైలు శిక్ష : షాక్ తిన్న టాలీవుడ్ | ఎర్రమంజిల్ కోర్ట్ కన్నెర్ర 

నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ కి ఎర్రమంజిల్ కోర్డు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే ఎన్టీఆర్ హీరోగా 2015లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో టెంపర్ అనే సినిమాని నిర్మించాడు బండ్ల గణేష్‌. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు. అయితే కథ అందించినందుకు గాను తనకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వనందుకు వక్కంతం కోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు కొద్ది సేపటి క్రితం తీర్పు ఇచ్చింది.
నష్టపరిహారం క్రింద వంశీకి పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయలు చెల్లించాలని , నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల జైలు శిక్ష విధించాలని తెలిపింది. చెక్ బౌన్స్ కేసులో ఈ వివాదం చాలా కాలం నుండి నడుస్తుండగా తాజాగా దీనిపై కోర్టు తీర్పునిచ్చింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. గణేష్ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. కెరీర్ లో తొలుత నటుడిగా రాణించిన బండ్ల గణేష్‌ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు.


Comments