పాపం కత్తి మహేష్ | పటాస్ షో లో ఎంత గోరంగా ట్రోల్ చేసారో | మిగతా వాళ్ళు అయితే చాల గొడవ అయ్యేది

పాపం కత్తి మహేష్ | పటాస్ షో లో ఎంత గోరంగా ట్రోల్ చేసారో | మిగతా వాళ్ళు అయితే చాల గొడవ అయ్యేది 
పవన్ కళ్యాణ్ అనే పేరు వింటే చాలు క్రిటిక్ కత్తి మహేష్ కస్సుమంటున్నాడు. పవన్ కళ్యాణ్‌పై చేసిన గతంలో కత్తి మహేష్ కొన్ని వివాదకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకి చూపించాల్సిందంతా చూపించారు. అయినా సరే కత్తి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పవన్‌ని, ఆయన అభిమానులని ఎదుర్కొంటూ.. మీడియాలో హైలైట్ అవుతున్నాడు.

బిగ్‌బాస్ షో కి ముందు కత్తి మహేష్ ఎవరో కూడా జనాలకి తెలియదు. కానీ ఇప్పుడు అతనిని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సెలబ్రిటీని చేశారు. వివాదాస్పదమైన కామెంట్లతో ఎప్పుడూ వార్తలలో ఉండే వర్మని కూడా మించిపోతున్నాడు కత్తి మహేష్. ఇది కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లే అనేది అందరికీ తెలిసిన సత్యమే.ఇక విషయంలోకి వస్తే.. రీసెంట్‌గా జబర్ధస్త్ షోలో కత్తిపై హైపర్ ఆది పంచ్‌లు పేల్చిన విషయం తెలిసిందే. ముందు పొట్ట, వెనుక బట్ట అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ తాజాగా కత్తి మహేష్ ఓ వీడియోని విడుదల చేశాడు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని కత్తి మహేష్ రెచ్చిపోయినట్లే, హైపర్ ఆది కూడా ఆ డైలాగ్‌తో చెలరేగిపోయాడు. మరి ఇది తప్పు అంటూ కత్తి మహేష్ తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పడం విశేషం.

Comments