మరి ఇంత బూతు జోకులు ఏ ఆడియో ఫంక్షన్ లోను వేయలేదు | యాంకర్ జాన్సీ ఏం ప్రశ్న నువ్వు అడిగేది

మరి ఇంత బూతు జోకులు ఏ ఆడియో ఫంక్షన్ లోను వేయలేదు | యాంకర్ జాన్సీ ఏం ప్రశ్న నువ్వు అడిగేది 
హీరో నిఖిల్ ‘శంకరాభరణం’తో చేదు అనుభవం తర్వాత, మరో నావెల్టీ అని భావించి ఈసారి హార్రర్ కామెడీలో నటిస్తూ, చేతిలో చిల్లర ఆడని ప్రేక్షుకుల ముందుకు సాహసించి వచ్చేశాడు. ‘టైగర్’ తీసిన దర్శకుడు వీఐ ఆనంద్ కిది రెండో సినిమా. ఇద్దరూ కలిసి ఈ హార్రర్ కామెడీతో సేఫ్ గేమ్ ఆడేద్దామని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే కంట్రోల్డ్ బడ్జెట్ సినిమాతో ఈ వారం ఆర్ధికంగా ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల మధ్య విచ్చేశారు- విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్! 


దర్శకుడి స్క్రీన్ ప్లే పేలవంగా మొదటి సీను నుంచే కన్పిస్తుంది. కథని ఎలా ముగించాలో తెలీనట్టు క్లయిమాక్స్ గందరగోళంగా తయారయింది. కథని ఓ పద్దతిగా ప్రారంభిస్తే దానికదే ఓ పద్దతిగా ముగుస్తుంది. అసలు తను ప్రేమించి పెళ్లి చేసుకోబోయిన అయేషా ఏమైందో హీరోకే తెలీని ప్రారంభం- కథ ఎలా ముగించాలో తెలీని క్లయిమాక్స్ కే కదా దారి తీసేది. కనీసం జరుగుతున్న వాటిపట్ల హీరోకి ఒక తెల్సుకోవాలన్న జిజ్ఞాస, పరిశీలనాత్మక దృష్టీ , అన్వేషణా ఏవీ లేక ఖాళీగా ఉండిపోతే కథని ఎలా ప్రారంభించి ఎలా ముగించగలరు. ఇందుకే సెకండాఫ్ లో ఇలా కాదని అలా, మళ్ళీ అలా కాదని ఇలా ఇష్టానుసారం ట్విస్టులు. మెదడుకి బాగా పని కల్పించుకుని ఈ ట్విస్టుల్ని ఫాలో అవడం సహన పరీక్షే. సినిమా ఆడేస్తుంది, ఏం ఫర్వాలేదు. హార్రర్ కామెడీ, అందునా స్టార్ వేల్యూ వున్న హార్రర్ కామెడీ నవ్వించేస్తూ తప్పకుండా ఆడేస్తుంది. పెద్దనోట్లు మాయమై, సినిమాల విడుదలలు అగమాగమైన వేళ, బాక్సాఫీసు దగ్గర సింగిల్ గా సినిమాకే ఢోకా లేదు.

Comments