రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి మూవీ లో కూడా యాక్ట్ చేసిందా. పెద్ద హీరోయిన్ అయ్యాక డిలీట్ చేసారు

రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి మూవీ లో కూడా యాక్ట్ చేసిందా. పెద్ద హీరోయిన్ అయ్యాక డిలీట్ చేసారు 
రెండుసార్లు మిస్‌ ఇండియా ఫైనల్స్‌కి వెళ్ళడమే కాకుండా నాలుగు సబ్‌ టైటిల్స్‌ గెల్చుకొని మోడలింగ్‌ ఫీల్డ్‌కి వెళ్ళి ఆ తర్వాత కన్నడలో 'గిల్లి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది అందాల హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. లేటెస్ట్‌గా సందీప్‌ కిషన్‌ హీరోగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కిరణ్‌ నిర్మించిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రకుల్‌ తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది 

మీ గురించి చెప్పండి? 

2011లో రెండుసార్లు మిస్‌ ఇండియా ఫైనల్స్‌కి వెళ్ళాను. ఇదికాక మిస్‌ ఇండియా హిస్టరీలోనే హయ్యస్ట్‌ సబ్‌కాంటెస్ట్‌ విన్నర్‌గా పేరు తెచ్చుకున్నాను. పాంటలూన్స్‌ ఫెమినా మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌, ఫెమినా మిస్‌ టాలెంటెడ్‌, ఫెమినా మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌, ఫెమినా మిస్‌ బ్యూటిఫుల్‌ ఐస్‌గా నాలుగు సబ్‌ టైటిల్స్‌ గెలుచుకున్నాను. ఆ తర్వాత ఒక తమిళ సినిమా చేశాను. ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నాను. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, రఫ్‌ తెలుగులో చేస్తున్నాను. తమిళ్‌లో గౌతమ్‌ కార్తీక్‌తో 'అలా మొదలైంది' రీమేక్‌ చేస్తున్నాను. హిందీలో టి. సిరీస్‌ వాళ్ళు చేస్తున్న 'యారియా' చిత్రంలో నటిస్తున్నాను. 


Comments