మొన్న మ్యాచ్ లో శ్రీ లంక టైం వేస్ట్ చేయడానికి చేసిన పనులు చూసి అందరు తిడుతున్నారు | అవి ఇవై ఇక్కడ చుడండి

మొన్న మ్యాచ్ లో శ్రీ లంక టైం వేస్ట్ చేయడానికి చేసిన పనులు చూసి అందరు తిడుతున్నారు | అవి ఇవై ఇక్కడ చుడండి
భారత్, శ్రీలంక మధ్య సోమవారం రసవత్తరంగా సాగిని తొలి టెస్టు థ్రిల్లింగ్ డ్రాగా ముగిసింది. లంకేయులు తృటిలో ఓటమి నుంచి తప్పుకున్నారు. మరోవైపు భారత్ విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచిపోయింది. కానీ చివరికి వెలుతురు లేమి కారణంగా ఫైనల్ సెషన్ ఆట ఆగిపోయింది. ఇంకా 20 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఆట ఆగిపోయింది. ప్రతికూల వాతావరణంలో రెండు రోజులు ఆటను కోల్పోయిన భారతీయ బౌలర్లు తమ సత్తాను చాటారు. 231 లక్షాన్ని ఛేదించేందుకు పూనుకున్న శ్రీలంక జట్టును భారతీయ సీమర్లు 75/7కే నిలువరించారు. శ్రీలంకను ఓటమివైపుకు మళ్లిస్తున్న తరుణంలో వెలుతురులేమి లంకేయులను ఆదుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కొత్త బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 8 పరుగులిచ్చి 4 వికెట్లు, మొహ్మద్ షమీ 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకుని శ్రీలంక జట్టుకు చుక్కలు చూపించారు. పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ సమర విక్రమ ఔటయ్యాడు.
 శ్రీలంక 22 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చండిమాల్(20), డిక్వెలా (27) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఓటమి నుంచి గట్టెక్కేందుకు కాలయాపన చేసే ప్రయత్నాలు చేశారు. డిక్వెలాను భువనేశ్వర్, చండిమాల్‌ను షమి పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు విజయావకాశ ఆశలు రేగాయి. చివరికి శనక(6), రంగనా హెరాత్ (0నాటౌట్) క్రీజులో ఉండగానే వెలుతురు లేమి కారణంగా ఆట ఆగిపోయింది. ఇంకా ఓవర్లు మిగిలి ఉన్నప్పటికీ నిగేల్ లాంగ్ లైట్ మీటర్ తీసుకుని వెలుతురు లేమి కారణంగా ఆటను ఆపేశారు. దాంతో శ్రీలంక డ్రెసింగ్ రూమ్‌లో పర్యాటక జట్టు క్రికెటర్లు బతికిపోయాంరా దేవుడా అన్నట్లు ఊపిరి తీసుకున్నారు. వారికి వెలుతురు లేమి పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.

Comments