ఈరోజు మ్యాచ్ లో గొడవ పడ్డ సమీ, శ్రీలంక బ్యాట్స్ మాన్ | దెబ్బకి సైలెంట్ అయ్యాడు సమీ ని చూసి, అంపైర్ వార్నింగ్ కూడా ఇచ్చాడు

ఈరోజు మ్యాచ్ లో గొడవ పడ్డ సమీ, శ్రీలంక బ్యాట్స్ మాన్ | దెబ్బకి సైలెంట్ అయ్యాడు సమీ ని చూసి, అంపైర్ వార్నింగ్ కూడా ఇచ్చాడు 
ఇండియా vs శ్రీలంక కోల్‌కతా టెస్టులో టీమిండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచిపోయింది. 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కోహ్లి సేన.. బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో విజయం దిశగా సాగింది. కానీ వెలుతురు లేమితో మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగానే ఆపేయడంతో భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. ఏడు వికెట్ల నష్టానికి 75 పరుగులతో శ్రీలంక మ్యాచ్‌ను ముగించింది. 171/1తో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ కోహ్లి దూకుడుగా ఆడి సెంచరీ చేశాడు. సిక్సర్ బాది శతకం పూర్తి చేసుకున్న కోహ్లి వెంటనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక రెండు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. భారత పేసర్లు విజృంభించడంతో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో చండీమల్ (20), డిక్వెల్లా (27) కాసేపు ప్రతిఘటించారు. కానీ కొద్ది విరామంలోనే పేసర్లు వీరిని వెనక్కి పంపారు. 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన స్థితిలో లంక ఓటమి అంచుల్లో చిక్కుకుంది. కానీ వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.
 

Comments