మీకు బఫున్ లాగా కనపడుతున్నానా, చెత్త డాన్స్ | గొడవ పడి షో లో నుండి వెళ్ళిపోయినా జానీ మాస్టర్

మీకు బఫున్ లాగా కనపడుతున్నానా, చెత్త డాన్స్ | గొడవ పడి షో లో నుండి వెళ్ళిపోయినా జానీ మాస్టర్ 
'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో... తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షో టీఆర్పీ రేటింగుల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ షో తొలి సీజన్ విన్నర్‌గా నిలిచి.... తన స్టార్ ఇమేజ్ మరింత పెంచుకున్నాడు నటుడు శివ బాలాజీ. బిగ్ బాస్ ముగిసిన తర్వాత టీఆర్పీ రేటింగులు తగ్గకుండా ఉండటానికి మాటీవీ వారు రేణు దేశాయ్ జడ్జిగా 'నీతోనే డాన్స్' అనే రియాల్టీ షోను ప్రారంభించారు. 
 రేణు దేశాయ్, జానీ మాస్టర్, అదా శర్మ న్యాయ నిర్ణేతలుగా సాగుతున్న ఈ షోలో...... శివ బాలాజీ-మధుమిత దంపతులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. శివ బాలాజీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నీతోనే డాన్స్ షోలో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇందుకు సంబంధించిన ప్రోమో చూస్తే పోటీ దారులు శివ బాలాజీ ఎంట్రీ చూసి టెన్షన్ పడ్డట్లు స్పష్టమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు' సినిమాలో తమ్ముడి పాత్రలో శివ బాలాజీ నటించిన సంగతి తెలిసిందే. ‘నీతోనే డాన్స్' షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో కాటమరాయుడు టైటిల్ సాంగుతో శివ బాలాజీ షోలోకి ప్రవేశించారు.



Comments