ఈ అమ్మాయి పెట్టిన వీడియో కి రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫాన్స్ | మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు కుమ్మేసింది

ఈ అమ్మాయి పెట్టిన వీడియో కి రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫాన్స్ | మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు కుమ్మేసింది  
పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'అజ్ఞాత వాసి' (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం తెరకెక్కుతోంది. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పాటలు, కొన్ని సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్‌, అను ఇమ్మాన్యుయేల్‌తో త్రివిక్రమ్‌ తీసిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టూ చేస్తూ ' గుడ్‌ కంపెనీ ..గుడ్‌ వర్క్‌' అని పేర్కొంది అను ఇమ్మాన్యుయేల్‌. ఈనెల ఏడో తేదీన త్రివిక్రమ్‌ పుట్టిన రోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులకు ఓ బహుమతి ఇవ్వబోతున్నారు. అదే... గతంలో పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

దీనికి అనుబంధంగా బయటకొచ్చి చూస్తే.. అనే గీతాన్ని అనిరుధ్‌ పాడుతున్నట్టు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో గీతం పల్లవి మాత్రమే అభిమానుల ముందుంచ్చారు. త్రివిక్రమ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని పూర్తి గీతాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ పాటను శ్రీమణి రాశాడు. దీంతో పాటు ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Comments