నీ ఎబ్బ లోకేష్ ఇంట్లో కూర్చొని ఎలా మాట్లాడాలో నేర్చుకో | పోసాని దెబ్బకి మీడియా వాళ్ళకే మైండ్ పోయింది

నీ ఎబ్బ లోకేష్ ఇంట్లో కూర్చొని ఎలా మాట్లాడాలో నేర్చుకో | పోసాని దెబ్బకి మీడియా వాళ్ళకే మైండ్ పోయింది 
ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. స‌ద్దు మ‌నిగింద‌నుకొన్న వివాదాన్ని నారా లోకేష్ మ‌ళ్లీ గెలుక్కున్నారు. తాజాగా అవార్డులపై పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా రద్దు చేస్తానంది అంటూ ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై పోసాని తీవ్రంగా స్పందించారు.ఆ కథనంలో తెలంగాణలో పన్నులు కట్టినవాళ్లకు నంది అవార్డులు ఇచ్చాం అని ఉటంకించడం భావ్యం కాదన్నారు. తెలంగాణలో పన్నులు కడితే మాట్లాడకూడదా.. ప్రభుత్వ వర్గాలు అంటూ కట్టు కథలు అల్లి పత్రికలు రాస్తే నోరు మూసుకుని కూర్చోవాలా.. ఆ వర్గాలు ఎవరో తీసుకురావాలని, అసలు నంది అవార్డులకు, నాన్ లోకల్ కు సంబంధం ఏంటి. అని ప్రశ్నించారు.ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా.. విమర్శించకూడదా.?..లోకేశ్‌… చదువుకున్నావా.. బుద్ది, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా… మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టటం లేదా..? ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా?. మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు’ అంటూ ప్రశ్నించారు. 



లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా?. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా?. 2014 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా?లోకేష్ పేరిట బంగారు నంది అవార్డులిచ్చుకోండి. కానీ అధికారం శాస్వతం కాదని పోసాని మండిపడ్డారు. తాను కమ్మ కులానికే చెందిన వాడినని, కానీ అవార్డుల విషయంలో విమర్శలు చేయాల్సి వస్తోందని, లోకేష్ లాంటి వాడు మంత్రిగా వుండటం ఖర్మ అని పోసాని ధ్వజమెత్తారు.టెంప‌ర్ సినిమాలో ఉత్త‌మ స‌హాయ న‌టుడి అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా.. అవార్డు తీసుకుంటే పోసాని కమ్మోడు కాబట్టే ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చారు అంటారు. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ పద్దతిలో మరోసారి విజేతలను ఎంపిక చేయండి. ’ అని పోసాని కోరారు.

Comments