ఈరోజు వేణు స్వామి ని ఒక ఆట ఆడుకున్న టీవీ 9 యాంకర్ దేవి నాగ వెళ్లి. పవన్ కళ్యాణ్ సీఎం కాడు - వేణు స్వామి

ఈరోజు వేణు స్వామి ని ఒక ఆట ఆడుకున్న టీవీ 9 యాంకర్ దేవి నాగ వెళ్లి. పవన్ కళ్యాణ్ సీఎం కాడు - వేణు స్వామి 
రాజకీయ నాయకుల భవిష్యత్ చెప్పే జ్యోతిష్యులు వేణు స్వామికి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేడి తగిలింది. చివరికి జ్యోతిష్యులు వేణు స్వామిని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వదలలేదు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కి సీఎం యోగ్యత లేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇష్టమొచ్చినట్లు.. అనికూడని మాటలతో వేణు స్వామికి కామెంట్స్ పెట్టారు. వేణు స్వామి ఈ కామెంట్స్ పై స్పందించారు. ఆయన మాటల్లోనే.. “అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2019 ఎలక్షన్స్ లో అసలు పోటీ చేస్తాడో.. చెయ్యాడో కూడా మీకు తెలియదు. ఆయన ఇప్పటివరకు చెప్పలేదు. ఆయన ఉన్న స్థానాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తాడో.. చెయ్యాడో తెలియదు. కాబట్టి.. ఇలాంటి పరిస్థితిలో ఆయన జాతక రీత్యా ఆయనకు సీఎం యోగం 2019లో లేదు అని నేను చెప్పాను. నన్ను జనాలు తిట్టడం స్టార్ట్ చేసారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే.. నన్ను అభిమానించే వాళ్ల కంటే.. నన్ను తిట్టేవాళ్ళ వల్ల పబ్లిసిటీ చాలా ఎక్కువగా జరుగుతుంది. మీ తిట్లే నాకు ఆశీర్వాదాలు.ఇక నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.. శాస్త్రాలను నమ్ముకున్న బ్రాహ్మణ జ్యోతిష్కుడు అయిన నేను ఒక పవన్ కళ్యాణ్ జాతకాన్ని పెడితేనే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ఇంతలా తిడితే.. కాంట్రవర్సీ లైఫ్ ఉండి.. పొలిటీషన్ గా అడుగుపెట్టాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ ని ఎంతమంది తిడతారు.. ఈ లాజిక్ ని మీరు మిస్ అయితే ఎలా? మంచిగా ఆలోచించండి.
మాలాంటి జ్యోతిష్కులనే మీరు అమ్మనా బూతులు తిడితే.. మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఇతర పార్టీ వాళ్ళు ఎంతలా తిడతారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేను పెట్టినటువంటి పోస్ట్ కింద.. మీరు తిడుతూ కామెంట్స్ పెడితే నాకు ఒరిగే నష్టం ఏమి లేదు.ఇక సైంటిఫిక్ గా ఒక ఇంజనీర్ అనేవాడు 100 ఇళ్ళు కడితే.. 5 ఇళ్ళు కూలిపోతాయి.. సైంటిఫిక్ గానే మీరు నిరూపించలేనప్పుడు చేయలేనప్పుడు..శాస్త్రాన్ని నమ్ముకుని.. దొంగచాటుగా పేపర్స్ లో వేయకుండా..నిజాయితీగా వీడియోస్ లో చెప్పడానికి దమ్ము, ధైర్యం కావలి.. నాకు మాత్రమే ఆ ధైర్యం ఉంది. నన్ను విమర్శించడానికి, స్టేటస్ లలో పెట్టడానికి పనికొచ్చే దమ్ము గురించి కాదు నేను మాట్లాడేది. ఒక సీఎం, సెలబ్రిటీలా జాతకాలు గురించి మాట్లాడాలంటే చాలా దమ్ము, ధైర్యం కావలి. అది నాకు ఉంది. ఒక బ్రాహ్మణుడిగా మా నాన్న నాకు ఒక్కటే మాట చెప్పారు. జోతిష్యుడికి, చాకలివాడికి, మంగలివాడికి, డాక్టర్ కి కులాలతోటి, పార్టీలతోటి సంబంధం లేదు. ఎదుకంటే.. ఎలాంటి వారు వీరి దగ్గరకు వచ్చిన వీరు చేసే వృత్తి వీరు చేయాల్సిందే. నేను కూడా అలానే చేస్తున్న. ఏ పార్టీ వాళ్ళ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నేను అందరి జాతకాలు చూస్తా.. అందరి మంచిని కోరుకునే వ్యక్తిని. చాలా మంది జోతిష్యులు ఉన్నారు. ఇంత ధైర్యంగా ఎవరు చెప్పారు.





Comments