ఈరోజు మళ్ళీ శ్రీ లంక బ్యాట్స్ మాన్ తో కామెడీ చేసిన విరాట్ కోహ్లీ. లైవ్ మ్యాచ్ లోనే అందరు నవ్వేశారు

ఈరోజు మళ్ళీ శ్రీ లంక బ్యాట్స్ మాన్ తో కామెడీ చేసిన విరాట్ కోహ్లీ. లైవ్ మ్యాచ్ లోనే అందరు నవ్వేశారు 
ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌కు శ్రీలంక ధీటైన జవాబు ఇస్తోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఏంజెలా మాథ్యూస్ ఏకంగా సెంచరీ బాదేశాడు. అతని తోడుగా కెప్టెన్ దినేశ్ చండిమాల్ కూడా అర్ధ శతకం చేయడంతో లంక స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. రెండో రోజు గాలి కాలుష్యంతో సాకుతో లంక ఆటగాళ్లు ఆటకు పదే పదే అంతరాయం కలిగించారు. దీంతో విసిగిపోయిన కోహ్లీ.. నాటకీయ పరిణామాల మధ్య భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
 భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 536/7 వద్ద డిక్లేర్ చేసి.. లంకకు అవకాశం ఇచ్చింది.స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన లంకను మాథ్యూస్-చండిమాల్ జోడి ఆదుకుందాం. మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించింది. 131/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన శ్రీలంక ఎలాంటి తడబాటు లేకుండా ఆడుతోంది. మాథ్యూస్, చండిమాల్ ఆచితూచి ఆడుతూ భారత బౌలర్లకు విసుగు తెప్పిస్తున్నారు. సెంచరీ సాధించడానికి మాథ్యూస్ 234 బంతులు ఆడాడు. 98 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మాథ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను సెకెండ్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ జారవిడిచాడు. దీంతో రెండోసారి తప్పించుకున్న మాథ్యూస్.. అదే ఓవర్లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు.



Comments