నన్ను కొడితే పవన్ కళ్యాణ్ జీవితం పోతుంది, రాష్టం మొత్తం గొడవ అవ్వుతుంది - కత్తి మహేష్ | నిన్న వార్నింగ్ లు ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్

నన్ను కొడితే పవన్ కళ్యాణ్ జీవితం పోతుంది, రాష్టం మొత్తం గొడవ అవ్వుతుంది - కత్తి మహేష్ | నిన్న వార్నింగ్ లు ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ 
అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘హలో’ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కావడం తెలిసిందే. సినీ ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల నుంచి ఈ మూవీపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తాజాగా సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ కూడా ఈ సినిమాను తనదైన శైలిలో విశ్లేషించాడు. ‘మనసంతా నువ్వే’ తరహా ప్రేమకథకు కాస్త యాక్షన్ జోడించి.. భావోద్వేగాలను మిళితం చేసి.. ప్రేక్షకులకు నచ్చే విధంగా ‘హలో’ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించారని కత్తి మహేశ్ అభినందించాడు.  అక్కినేని అఖిల్ తొలి మూవీ ‘అఖిల్’ సినిమా నిరాశపరిస్తే.. ఆ ఆశలను ‘హలో’ సినిమా నిజం చేసిందని చెప్పాడు. 
ప్రేమకథా చిత్రాలకు ప్రేమ జంటే ప్రధానమన్న కత్తి మహేశ్.. అఖిల్ - కల్యాణి జంట చూడ చక్కగా ఉందని కితాబిచ్చాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు నటన కూడా సినిమాకు కలిసొచ్చిందని కత్తి మహేశ్ చెప్పాడు. సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు వేయొచ్చని తెలిపాడు. అనూప్ రూబెన్స్ సంగీతం కాస్త నిరుత్సాహపర్చినట్లు కత్తి చెప్పాడు. అనూప్ సంగీతం ‘మనం’ దగ్గరే ఆగిపోయిందేమోనని ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అనిపించిందని అభిప్రాయపడ్డాడు. మ్యూజిక్ కూడా ఆశించిన విధంగా ఉంటే సినిమాకు మరింత కలిసొచ్చేదని అభిప్రాయపడ్డాడు. మొత్తం మీద ప్రేక్షకులకు సినిమా చూసిన తర్వాత ఓ అందమైన అనుభూతి కలగడం ఖాయమని కత్తి మహేశ్  విశ్లేషించాడు.



Comments