నిన్న రాత్రి కత్తి మహేష్ కి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ | కత్తి మహేష్ మాటలు చూసి మెచ్చుకున్నా ప్రజలు

నిన్న రాత్రి కత్తి మహేష్ కి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ | కత్తి మహేష్ మాటలు చూసి మెచ్చుకున్నా ప్రజలు 

మీడియాలో నానేందుకు నిత్యం ఏవరి పైనో లేక ఏదో అంశం పైనో స్పందిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మహేష్ కత్తి తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ఏపీకి చేవగల ఎంపీలు కావాలంటూ గురువారం పోస్ట్ పెట్టిన ఆయన, తాజాగా విభజన హామీలపై స్పందించారు. 'విభజన హామీల కోసం పోరాడటం అంటే అడుక్కోవడం, లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం కాదు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల కోసం పార్లమెంటు ప్లోర్ మీద పోరాడాలి.' అని సామాజిక అనుసంధాన వేదిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.గురువారం లోకసభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ పైనా కత్తి మహేష్ స్పందించారు. ఇది మంచి నిర్ణయమని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఇక యూనిఫాం సివిల్ కోడ్ కూడా తీసుకొని వస్తే ప్రజాస్వామ్యానికి మంచిది అన్నారు. ముస్లీం మహిళలకు గౌరవం కల్పించేందుకు కేంద్రం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బిల్లును లోకసభలో ఆమోదింప చేసిన విషయం తెలిసిందే.
ప్రసార మాధ్యమాల్లో తన పేరు వినిపించేందుకు, ప్రజల్లో నానేందుకు కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వరుసగా విమర్శలు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన పదేపదే తన పోస్టులలో పవన్‌పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా అప్పుడప్పుడు టార్గెట్ చేశారు ఓ వైపు పవన్‌ను విమర్శిస్తూనే మరోవైపు ఏపీ ఎంపీలు, విభజన హామీలపై తాజాగా స్పందించారు. కత్తి మహేష్ పదేపదే పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన వెనుక జగన్ ఉన్నాడనే విమర్శలు గతంలో వచ్చాయి. 'ఏపీకి చేవగల ఎంపీలు కావాలని', 'విభజన హామీల కోసం పోరాడటం అంటే అడుక్కోవడం, లోపాయకారి ఒప్పందాలు' కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను అందరిని విమర్శించారనే అర్థం వచ్చేలా పేర్కొన్నారు. జగన్ మద్దతుదారుగా ఎవరూ భావించవద్దనే అలా పేర్కొని ఉంటారని అంటున్నారు. కానీ ఆయన వెనుక జగన్ ఉన్నట్లుగానే భావించవచ్చునని కొందరు అంటున్నారు. అందుకు కారణం.. ఆయన ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్‌ను అంటున్నారు. కానీ ఎక్కడ జగన్‌ను విమర్శించలేదని గుర్తు చేస్తున్నారు. ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని అంటున్నారు.


Comments