ఈరోజు మ్యాచ్ లో అంపైర్ తో కామెడీ చేసిన కోహ్లీ | శ్రీ లంక బ్యాట్స్ మాన్ DRS నిర్ణయం చూసి కామెడీ | సమీ సూపర్ బౌన్సర్

ఈరోజు మ్యాచ్ లో అంపైర్ తో కామెడీ చేసిన కోహ్లీ | శ్రీ లంక బ్యాట్స్ మాన్ DRS నిర్ణయం చూసి కామెడీ | సమీ సూపర్ బౌన్సర్ 

శ్రీలంక క్రీడల మంత్రి దయసిరి జయశేఖర అహం దెబ్బతింది. తన అనుమతి లేకుండా ఢిల్లీ విమానం ఎక్కిన 9 మంది వన్డే ఆటగాళ్లను ఎయిర్‌పోర్టులోనే ఆపేశారు. తన అనుమతి లేకుండా దేశం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడల మంత్రి నిర్వాకంతో విసుగుపోయిన క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తన ఆమోదం లేకుండా క్రికెట్ జట్టు దేశం విడిచిపెట్ట వెల్లడం క్రీడల చట్టాన్ని ఉల్లంఘించడమే అని జయశేఖర వెల్లడించారు. ఆటగాళ్లు వేరే దేశంలో ఆడటానికి వెళ్తున్నప్పుడు తన ఆమోదం తప్పనిసరి అన్నారు.భారత్, శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 10 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్‌లో పాల్గొనడానికి కెప్టెన్ తిసారా పెరీరా సహా 9 మంది ఆటగాళ్లు సోమవారం భారత్‌కు బయలుదేరాల్సి ఉంది. అయితే దీనికి శ్రీలంక క్రీడల మంత్రి ఆమోదం అవసరం. దీని కోసం సోమవారం సాయంత్రం క్రీడా శాఖకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆమోద పత్రాన్ని పంపింది. కనీసం 12 గంటల ముందు పంపాల్సిన ఆమోద పత్రాన్ని ఆటగాళ్ల ప్రయాణానికి కొన్ని గంటల ముందు పంపడంతో మంత్రిగారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆటగాళ్ల ప్రయాణాన్ని రద్దుచేయించి వెనక్కి రప్పించారు.

Comments